newssting
Radio
BITING NEWS :
మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత. కొద్దిరోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న నాయిని. మళ్లీ లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలోలో చికిత్స. బుధవారం అర్థరాత్రి 12.25 గంటలకు నాయిని మరణించినట్లు తెలిపిన అపోలో ఆస్పత్రి వర్గాలు. * 6వ రోజు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నదసరా మహోత్సవాలు. లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. * మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్. మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై బాలుడి మృతదేహం. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు. పోలీసుల అదుపులో బాధిత కుటుంబ బంధువు మనోజ్ రెడ్డి. * మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా. నేడు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం. * కరోనా టీకా వికటించి వాలంటీర్ మృతి. బ్రెజిల్ లో టీకాను అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా. వాలంటీర్ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్న ఆక్స్ ఫర్డ్ వైద్యులు.

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

19-09-202019-09-2020 07:34:57 IST
2020-09-19T02:04:57.406Z19-09-2020 2020-09-19T02:04:50.962Z - - 23-10-2020

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుంది అనే విషయం ఏ దేశానికి ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. అయితే  ఎప్పుడు వచ్చినా మొత్తం తయారయిన వ్యాక్సిన్‌ డోసుల్లో కేవలం 12 శాతం మాత్రమే 50 శాతం ప్రపంచానికి అందుబాటులో ఉంటాయని తాజా సమాచారం. ప్రపంచంలోని ఆరేడు దేశాలు మాత్రమే మొత్తం ఉత్పత్తయ్యే వ్యాక్సిన్‌లలో 88 శాతం డోసులు కొనుగోలు చేసేస్తాయనీ మిగిలిన దేశాలు వ్యాక్సిన్ దొరక్క అవస్థలు పడక తప్పదని అంచనా.

గ్లోబల్‌ ప్రిపేర్డ్‌నెస్‌ మానిటరింగ్‌ బోర్డు (జీపీఎంబీ) ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం కోవిడ్ వ్యాక్సిన సరఫరాలో తీవ్ర అసమానతలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాలకే పరిమితమనీ, పేద, మధ్యతరగతి దేశాలకు అందడం గగనమేనని ఈ నివేదిక చెబుతోంది. 50% ప్రపంచానికి 12 శాతం డోసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని, ప్రపంచం మొత్తం మీద అత్యధిక వ్యాక్సిన్ డోసులు భారతదేశానికే అవసరం కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తయ్యే వ్యాక్సిన్‌లలో 41 శాతం డోసులు భారత్ సొంతంగా కొనుగోలు చేసి సమకూర్చుకోవలసి ఉంటుందని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది.

ఈ మేరకు భారత్‌తో పాటు పలు దేశాలు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత్‌ తర్వాత యూరోపియన్‌ యూనియన్, ఆ తర్వాత అమెరికా, చైనా, బ్రెజిల్, యూకే, ఆస్ట్రేలియా దేశాలు... ఎక్కువ డోసులు అవసరమయ్యే, కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం ఈ ఆరు దేశాలు, ఈయూ కలిపి మొత్తం తయారయ్యే వ్యాక్సిన్‌ డోసుల్లో 88 శాతం తీసుకుంటే, ఇక మిగిలిన 50 శాతం ప్రపంచానికి అందుబాటు లో ఉండేది 12 శాతమేనట. 

ఇదే నిజమైతే కోవిడ్‌ మహమ్మారిని అంతం చేయడం జరిగే పనికాదని, వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చుకోలేని దేశాల్లో ఇది మరింత ప్రబలి వ్యాక్సిన్లు సమకూర్చుకున్న దేశాలపైనా ప్రభావం చూపుతుందని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది. అందుకే తాము కోవ్యాక్స్‌ పేరుతో ప్రపంచంలోని పేద, మధ్య తరగతి దేశాలకు తగినన్ని వ్యాక్సిన్‌ డోసులు పంపేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలతో ఆయా దేశాలు ఒప్పందాలు కూడా చేసేసుకున్నాయని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది.  

అయితే కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో మాత్రం భారత్‌కు తిరుగులేని ప్రాధాన్యత ఉందని ప్రపంచ స్థాయి నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి 60 శాతం పైగా వ్యాక్సిన్‌లను తక్కువ ధరకు అందిస్తున్న ఘనత భారత్‌కే ఉంది. అందుకే కోవిడ్ వ్యాక్సిన్‌ని ప్రపంచానికి అందించడంలో కూడా భారత్‌దే పైచేయిగా ఉంటుందని, భారత్ కోవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కరణలో ముందువరుసలో ఉంటే మనకూ ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా అది మేలు చేకూరుస్తుందని పుణేలోని సీపీసీ అనలిటిక్స్ సహ వ్యవస్థాపకుడు షాహిల్ డియో పేర్కొన్నారు.

 

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

   16 hours ago


బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

   16 hours ago


భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

   16 hours ago


ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

   17 hours ago


కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

   18 hours ago


టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

   18 hours ago


భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

   21-10-2020


సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

   21-10-2020


ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

   21-10-2020


చైనా సైనికుడిని అప్పగించేశారు

చైనా సైనికుడిని అప్పగించేశారు

   21-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle