newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆయన మోనార్క్.. గవర్నర్ ఆర్డర్ బుట్టదాఖలు

20-07-201920-07-2019 09:20:35 IST
Updated On 20-07-2019 11:41:52 ISTUpdated On 20-07-20192019-07-20T03:50:35.873Z20-07-2019 2019-07-20T03:50:28.660Z - 2019-07-20T06:11:52.118Z - 20-07-2019

ఆయన మోనార్క్.. గవర్నర్ ఆర్డర్ బుట్టదాఖలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా ఇప్పుడు కర్నాటక వైపు చూస్తోంది. కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ తనదైన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గవర్నర్ గడువును ఆయన పక్కన పెట్టేశారు.

అసెంబ్లీలో సీఎం కుమారస్వామి అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా, దానిపై ఓటింగ్ జరుగకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్-జేడీ(ఎస్) సభ్యులు విజయవంతం అయ్యారు.  విశ్వాస పరీక్షకు పట్టుబట్టిన ప్రతిపక్ష బీజేపీ.. తమ పంతం నెగ్గకపోవడంతో గవర్నర్ వజూభాయ్ వాలాకు ఫిర్యాదు చేసింది. 

బీజేపీ ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్  బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు సూచించారు. అయితే ఓటింగ్ నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి సభను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అనంతరం శుక్రవారం సభ ప్రారంభమయ్యాక గవర్నర్ మళ్ళీ జోక్యం చేసుకున్నారు. మధ్యాహ్నం 1.30లోగా బలం నిరూపించుకోవాలని సూచించారు. 

ఇదిలా ఉంటే.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే 15 ఎమ్మెల్యేలు సభకు రాలేదు. అసెంబ్లీకి హాజరు కావాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అనారోగ్యంతో ముంబైలోని ఇక ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వానికి మద్దతునిస్తున్న ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మహేశ్ కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో అధినేత్రి మాయావతి తనకు తెలియజేయలేదని అందుకే దూరంగా ఉన్నానని బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ చెప్పడం విశేషం. మరోవైపు ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి తాను విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి మద్దతునిస్తానని చెప్పడం అధికార పక్షానికి ఊరట లభించింది. 

విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు బీఎస్.యడ్యూరప్ప లేచి ఒక్కరోజులోనే విశ్వాస పరీక్షను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అటు సీఎల్పీ నేత సిద్ధరామయ్య పాయింట్ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తారు.

సీఎల్పీ లీడర్‌గా విప్‌ను జారీ చేసే తన అధికారాలకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డుకట్ట వేసిందన్నారు. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను సభకు హాజరు కావాలని ఒత్తిడి చేయరాదని కోర్టు ఆదేశించిందని, విప్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రస్తావన లేదని ఆయన గుర్తు చేశారు. బలపరీక్ష కోసం బీజేపీ సభ్యులు పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలు ముందుకు సాగలేదు.

మరోవైపు యడ్యూరప్ప కుమారస్వామి ప్రభుత్వానికి మెజారిటీ లేదన్నారు.  తమపక్షాన ఇద్దరు ఇండిపెండెంట్లతో సహా మొత్తం 107 మంది ఉన్నారని తెలిపారు. అధికార పక్షానికి వందకన్నా తక్కువ మంది సభ్యుల బలం ఉందని చెప్పారు. గవర్నర్ సూచించిన గడువు ముగియడంతో మరోమారు సాయంత్రం ఆరుగంటల వరకూ సమయం ఇచ్చారు. అయినా ఆ సమయం కూడా ముగిసిపోయింది. 

గవర్నర్ తీరుపై స్పీకర్ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ చైర్‌ ను గవర్నర్‌ డిక్టేట్ చేయలేరంటూ సభాపతి మండిపడ్డారు.  సభలో మరోసారి గందరగోళం నెలకొనడంతో.. సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. ఎంత రాత్రి అయినా సరే.. ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ స్పీకర్ ఓటింగ్ నిర్వహించకుంటే రాష్ట్రపతిని కలవాలని బీజేపీ భావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చని తెలుస్తోంది. 

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   4 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   12 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   12 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   a day ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle