newssting
Radio
BITING NEWS :
మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత. కొద్దిరోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న నాయిని. మళ్లీ లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలోలో చికిత్స. బుధవారం అర్థరాత్రి 12.25 గంటలకు నాయిని మరణించినట్లు తెలిపిన అపోలో ఆస్పత్రి వర్గాలు. * 6వ రోజు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నదసరా మహోత్సవాలు. లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. * మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్. మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై బాలుడి మృతదేహం. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు. పోలీసుల అదుపులో బాధిత కుటుంబ బంధువు మనోజ్ రెడ్డి. * మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా. నేడు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం. * కరోనా టీకా వికటించి వాలంటీర్ మృతి. బ్రెజిల్ లో టీకాను అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా. వాలంటీర్ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్న ఆక్స్ ఫర్డ్ వైద్యులు.

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

19-09-202019-09-2020 13:12:07 IST
2020-09-19T07:42:07.844Z19-09-2020 2020-09-19T07:41:55.225Z - - 23-10-2020

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్న అల్ ఖైదా కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా సోదాలు జరుపగా.. అల్ ఖైదాకు చెందిన 9 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు, పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ లో ఆరుగురిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏకు పట్టుబడిన వీరంతా దేశంలో జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబు బ్లాస్ట్ లు చేసి అమాయకుల ప్రాణాలు తీసేందుకు కుట్రపన్నుతున్నట్లు ఎన్ఐఏ జాతీయ మీడియాకు తెలిపింది.

ఎన్ఐఏకు చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదుల నుంచి ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తం దస్త్రాలను, డిజిటల్ డివైజ్ లను, జీహాదీ సాహిత్యాన్ని, దేశంలో తయారైన తుపాకులు, బాడీ ఆర్మర్లు, పదునైన ఆయుధాలతో పాటు ఇంట్లోనే ప్రమాదకరమైన బాంబ్ లను తయారు చేసేందుకు అవసరమయ్యే మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పాకిస్థాన్ కు చెందిన ఆల్ ఖైదా భారత్ లో ఉన్న పౌరులను సోషల్ మీడియా ద్వారా బాంబ్ దాడులకు ప్రేరేపిస్తుందని, తాజాగా తమ అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులంతా ఈ కోవకు చెందిన వారేనని ఆయన పేర్కొన్నారు. వీరంతా దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో బాంబ్ దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసిందన్నారు. అలాగే స్థానికంగానే ఉంటూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఫండ్స్ కలెక్ట్ చేసి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారి తెలిపారు.

అంతర్రాష్ట్ర ఉగ్రముఠాలో ఉన్న 9 మంది స్థానికంగా పేలుళ్లు చేసేందుకు కుట్రలు పన్నడమే కాకుండా.. పలువురిని కూడా ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వారిలో ముర్షీద్‌ హసన్‌, యాకుబ్‌ బిస్వాస్‌, ముషారప్‌ హుస్సేన్, షకీబ్‌, అబు సోఫియాన్‌, మెయినల్‌ మోండల్‌, యీన్‌ అహ్మద్‌, మనుమ్‌ కమల్‌, రెహ్మాన్ లు ఉన్నారు. వీరందరినీ ఎన్ఐఏ అధికారులు సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచి, కస్టడీకి తీరుకోనున్నారు.

https://twitter.com/ANI/status/1307164877752922115

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

   15 hours ago


బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

   16 hours ago


భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

   16 hours ago


ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

   16 hours ago


కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

   18 hours ago


టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

   18 hours ago


భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

   21-10-2020


సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

   21-10-2020


ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

   21-10-2020


చైనా సైనికుడిని అప్పగించేశారు

చైనా సైనికుడిని అప్పగించేశారు

   21-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle