newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అర్థంకాని రాహుల్ గాంధీ తీరు

18-06-201918-06-2019 08:13:16 IST
2019-06-18T02:43:16.432Z18-06-2019 2019-06-18T02:41:20.449Z - - 14-05-2021

అర్థంకాని రాహుల్ గాంధీ తీరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాహుల్ గాంధీ తీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఏమాత్రం అర్థం కావ‌డం లేద‌ట‌. కాంగ్రెస్ పార్టీ చ‌తికిల‌ప‌డ్డ స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లకూ, నేత‌ల‌కూ ధైర్యం చెప్పాల్సిన రాహుల్, అధ్య‌క్ష ప‌ద‌వి త‌న‌కు వ‌ద్దంటూ లండ‌న్ వెళ్ల‌డం ఏంట‌ని ఆ పార్టీ నేత‌లే ప్ర‌శ్నిస్తున్నారు. ఇక త‌మ పార్టీని కాపాడ‌టం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని మండిప‌డుతున్నారు.

ఇక రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా రాహుల్ తీరు మీద విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. క్రియాశీల రాజకీయాల్లో మొద‌టి నుంచీ అస‌హ‌నంగా, అనుమానంగా ప్ర‌వ‌ర్తించారట రాహుల్ గాంధీ. ఏదో ముళ్లకంప మీద కూర్చున్నట్లు రాహుల్ గాంధీ ప్రవర్తించేవారనీ, ప‌లుమార్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండ‌టం కూడా ఆయ‌న విచిత్ర ధోర‌ణికి అద్దం ప‌డుతోంద‌ని చెబుతున్నారు. 

అయితే రాహుల్ లండ‌న్ వెళ్ల‌డానికి కార‌ణాలు కూడా విశ్లేషిస్తున్నారు. అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ గాంధీ ఒప్పుకుంటే, పార్టీని విజ‌య పథంలో న‌డిపించ‌డం ఆయ‌న‌తో జ‌రిగే ప‌నికాదు. అలాఅని అధ్య‌క్ష ప‌ద‌వికి దూరంగా ఉంటే, 125 సంవ‌త్స‌రాల‌కు పైగా చ‌రిత్ర ఉన్న పార్టీ కుక్క‌లు చింపిన విస్త‌రి అవ్వ‌డం ఖాయం. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబానికి చెందిన వ్య‌క్తులు న‌డిపిస్తేనే అంద‌రూ మాట వింటారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఉన్నా, అధిష్టానానికి ఎదురు చెప్ప‌రు.

ఇప్పుడు రాహుల్ గాంధీని అధ్య‌క్ష ప‌ద‌వి వద్ద‌ని చెప్పడంతో ఏం చేయాలో ఆ పార్టీ నేత‌ల‌కు పాలు పోవ‌డం లేద‌ట‌. గాంధీ ఏత‌ర కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వాల‌ని కొంద‌రు వాదిస్తున్నా, గత అనుభ‌వం వారిని వెంటాడుతోంద‌ట‌. గ‌తంలో పీవీ న‌ర్శింహారావుకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించిన సంద‌ర్భంలో ఎన్.డీ. తివారి నేతృత్వంలో కొంద‌రు కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీన చీల్చారు. 

తివారీ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త దుకాణం తెరిచారు. ఆ త‌ర్వాత పీవీని త‌ప్పించ‌డం, సీతారం కేస‌రికి అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డంతో, తివారీ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వ‌డం జ‌రిగింది. అందుకే ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే ఎదురు అవుతుంద‌ని హ‌స్తం పార్టీ సీనియ‌ర్లు భ‌య‌ప‌డుతున్నారట‌. అస‌లే కొన ఊపిరితో ఉన్న పార్టీ, చీలిపోతే ఎలాగ‌ని భ‌య‌ప‌డుతున్నారట‌. ఇక‌ రాహుల్ గాంధీ తీరుతో ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య కుమ్ములాట‌లు మ‌రింత ముదిరాయ‌ట‌. అస‌లే మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏకంగా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు కాంగ్రెస్ పార్టీ.

ఇక మ‌ధ్య‌ప్రదేశ్, పంజాబ్, హ‌ర్యానా, తెలంగాణాల్లో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త విబేధాల‌తో ప‌లువురు జిల్లా స్థాయి నేత‌లు బీజేపీతో పాటు స్థానిక పార్టీల్లోకి వెళ్తున్నార‌ట‌. ఇప్ప‌టికే తాము అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, పంజాబ్, పుదుచ్చేరి ప్ర‌భుత్వాల మీద బీజేపీ క‌న్నేసింద‌నేది కాంగ్రెస్ నేత‌ల భ‌యం. ఏ క్ష‌ణంలో ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టి, బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న అనుమానంతో కాంగ్రెస్ పెద్ద‌లు వ‌ణికిపోతున్నార‌ట‌. ఇలాంటి స‌మ‌యంలో రాహుల్ గాంధీ దేశం విడిచి పోవ‌డం ఏంట‌ని చాలామంది కాంగ్రెస్ పెద్ద‌లే ప్ర‌శ్నిస్తున్నారు.

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   2 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   10 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle