newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అమెరికాతో మా ప్రచ్ఛన్నయుద్ధంలో వేలుపెట్టొద్దు.. భారత్‌కు చైనా వార్నింగ్

02-06-202002-06-2020 16:31:55 IST
Updated On 02-06-2020 17:00:57 ISTUpdated On 02-06-20202020-06-02T11:01:55.538Z02-06-2020 2020-06-02T11:01:52.954Z - 2020-06-02T11:30:57.969Z - 02-06-2020

అమెరికాతో మా ప్రచ్ఛన్నయుద్ధంలో వేలుపెట్టొద్దు.. భారత్‌కు చైనా వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలో మొదలవుతున్న కొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో భారత ప్రభుత్వం చేరాలని కొన్ని దేశాల నేతలు పిలుపునిస్తున్నారని చైనా పత్రిక ది గ్లోబల్ టైమ్స్ వ్యాసం ప్రచురించింది. ప్రచ్ఛన్న యుద్ధంలో పాలు పంచుకుంటే భారత్‌కు లాభదాయకంగా ఉంటుందని ఈ దేశాలు భారత్‌ను ఎగదోస్తున్నాయని కానీ వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధంలో కాలుపెడితే భారత్‌కు లాభాల మాటేంటో కాని నష్టపోయేదే ఎక్కువగా ఉంటుందని గుర్తించుకోవాలంటూ ది గ్లోబల్ టైమ్స్ పత్రిక హెచ్చరించింది. ఈ పత్రిక చైనా అధికార వాణి అని తెలిసిందే.

అమెరికాకు తమకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో వేలు పెట్టడం భారత్‌కు అంత మంచిది కాదంటూ చైనా హెచ్చరించింది. అమెరికాకు వత్తాసు పలికినా.. ఆ దేశం తరపున ఏమైనా చర్యలకు దిగినా, అది భారత్‌-చైనాల మధ్య సత్సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. 

ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భారత్‌, చైనాతో సంబంధాలు దెబ్బతింటే మరింతగా ఇబ్బందుల్లోకి జారుకుంటుందని ఆ కథనం హెచ్చరించింది. తమ వివాదంలో వేలు పెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ వాటిల్లుతుందన్న విషయాన్ని భారత్‌ గుర్తించాలని హితవు పలికింది. 

మరోవైపు.. భారత్‌-చైనా సరిహద్దుల్లోని వ్యూహాత్మక పరిస్థితుల్ని చైనా అనుకూలంగా మలచుకుంటోందని.. తద్వారా తమపై బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా సెక్రటరీ మైక్‌ పాంపియో ఆరోపించారు. ఒకవైపు భారత్‌ సరిహద్దుల్లో, మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును ప్రదర్శిస్తోందన్నారు. 

భారత్‌తో ఏమాత్రం ముప్పు ఉందని భావించినా.. వెంటనే దాడి చేసేవిధంగా చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తమ సైన్యాన్ని బలోపేతం చేసుకుంటున్నారని వెల్లడించారు. తమ సైన్యం భారత్‌, ఆస్ట్రేలియా వంటి స్నేహితులకు కూడా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. 

కాగా, భారత్‌, చైనాలు తమ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని ఆస్ట్రేలియా సూచించింది. భారత్‌తో సరిహద్దుల్లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు. 

కాగా, చైనాతో సరిహద్దులో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకై అఖిలపక్షాన్ని కూడా ప్రభుత్వం సంప్రదించాలని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. ఈమేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కోరారు. 

లడక్ మరియు ఉత్తర సిక్కింలో వాస్తవాధీన రేఖ పొడవునా చైనా, భారత సైన్యాలు భారీగా మోహరించాయి. ఇప్పటికే రెండుసార్లు ఇరు పక్షాలూ సంప్రదింపులు జరిపినా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయనడానికి సైన్యాల మోహరింపే నిదర్శనం.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   9 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   12 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle