newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

02-08-202002-08-2020 17:51:32 IST
Updated On 02-08-2020 19:07:26 ISTUpdated On 02-08-20202020-08-02T12:21:32.599Z02-08-2020 2020-08-02T12:20:44.892Z - 2020-08-02T13:37:26.654Z - 02-08-2020

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎవరినీ వదలడం లేదు కరోనా మహమ్మారి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఇప్పటివరకూ 17లక్షల 56వేల 220 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 37 వేల 436 గా నమోదైంది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు నిర్వహించుకోవడంతో తనకు పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశారు. 

వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. తనను కలిసిన వారందరినీ అలర్ట్ చేశారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దు. కరోనా పాజిటివ్ అని భయపడవద్దు. 

యూపీలో, మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్రలో ఏకంగా 10వేలమంది పోలీసులు కరోనా బారినపడ్డరంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి బారినపడ్డారు.

పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏపీలో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ప్రదేశ్‌లో కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్ (62) కరోనా బారినాకు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో కన్నుమూశారు. బిహార్‌లో బీజేపీకి చెందిన సుమారు 100 మంది నేతలు ఈ ప్రాణాంతక వైరస్ బారినపడ్డారు. హోంమంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ ఆకాంక్షించారు.

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

   18 hours ago


పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

   20 hours ago


పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

   21 hours ago


చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

   21 hours ago


ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

   a day ago


పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

   19-09-2020


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

   19-09-2020


అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

   19-09-2020


ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

   19-09-2020


రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

   18-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle