newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

క‌రోనా ఎఫెక్ట్‌: బీసీసీఐ కార్యాలయం మూసివేత

17-03-202017-03-2020 14:32:57 IST
2020-03-17T09:02:57.847Z17-03-2020 2020-03-17T09:02:48.516Z - - 01-06-2020

క‌రోనా ఎఫెక్ట్‌: బీసీసీఐ కార్యాలయం మూసివేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశం ఇప్పుడు కరోనా భయంతో అట్టుడికిపోతోంది. కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ వాయిదా పడడంతో పాటు తాజాగా ప్రాక్టీసు శిబిరాలు నిలిపివేశారు. ఆటగాళ్లు వెళ్లిపోవచ్చని ఫ్రాంచైజీలు సూచించాయి. ఐపీఎల్ కోసం ఎప్పుడు రావాలో సమాచారం అందిస్తామని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. మరోవైపు బీసీసీఐ కార్యాలయం మూసివేతతో ఉద్యోగులు ఇళ్ళకే పరిమితం కానున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యాలయానికి తాళం వేసినట్టు తెలిపింది. 

ముంబైలోని ప్రధాన కార్యాలయాన్ని మంగళవారం నుంచి మూసివేశారు. అంతేకాదు.. ఆఫీసు ఉద్యోగులందరికీ ఇంటినుంచే పని చేసేలా ఆదేశాలు ఇచ్చామని బోర్డు అధికారి  వెల్లడించారు. ‘వాంఖడే స్టేడియంలోని ప్రధాన కార్యాలయం ఉద్యోగులందరికీ ఇంటినుంచే విధులు నిర్వర్తించాల్సిందిగా సూచించాం. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా వారిదంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అని ఆ అధికారి తెలిపారు.

దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో క్రీడాకారుల, సందర్శకుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఐపీఎల్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. భూ, జల, వాయు మార్గాలు మూసివేసింది. పలు రాష్ట్రాల్లో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించింది. నిషేధిత జాబితాలో ఈయూ, టర్కీ, బ్రిటన్‌ చేర్చింది. ఆయా దేశాల్లోని భారతీయులకూ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 125కి చేరారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 14వేల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

 

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

   31-05-2020


స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

   31-05-2020


అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

   30-05-2020


ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

   29-05-2020


ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

   28-05-2020


క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

   27-05-2020


 క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

   27-05-2020


హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

   26-05-2020


మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

   26-05-2020


బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle