newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే మంజ్రేకర్ తప్పా.. పండిట్ సమర్థన

20-03-202020-03-2020 08:28:43 IST
2020-03-20T02:58:43.828Z20-03-2020 2020-03-20T02:58:04.790Z - - 04-06-2020

ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే మంజ్రేకర్ తప్పా.. పండిట్ సమర్థన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ సభ్యుడు సంజయ్ మంజ్రేకర్‌ది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్ప అతడికి వేరే ఉద్దేశాలు ఉండవని మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ వెనుకేసుకొచ్చాడు. కావాలంటే వ్యాఖ్యానాల్లో దూకుడు కాస్త తగ్గించమని బీసీసీఐ హెచ్చరించి మళ్లీ అతడిని విధుల్లోకి తీసుకోవాలని, అంతేకాని తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం న్యాయం కాదని పండిట్ సమర్థించాడు.

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్‌ మంజ్రేకర్‌కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌.. ఎవర్నీ కావాలని గాయపరచడంటూ వెనుకేసుకొచ్చాడు. తనకు మంజ్రేకర్‌ చిన‍్నతనం నుంచి తెలుసని, అతనిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండన్నాడు. 

ఒక కామెంటరీ చెప్పేటప్పుడు ప్రతీసారి ప్రజల్ని ఆకట్టుకునే వ్యాఖ్యానాలు అతను చేయలేకపోవచ్చని, అందుచేత మంజ్రేకర్‌ను తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం భావ్యం కాదన్నాడు. మంజ్రేకర్‌ను కాస్త దూకుడు తగ్గించమని బీసీసీఐ ఒక వార్నింగ్‌ ఇచ్చి, మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకోవాలన్ని చంద్రకాంత్‌ పండిట్‌ కోరాడు.

‘నాకు మంజ్రేకర్‌ బాల్యం నుంచి తెలుసు. ఇతరుల్ని గాయపరిచే మనస్తత్వం అతనిదైతే కాదు. ఉన్నది ఉన్నట్లు వ్యక్తిత్వం మంజ్రేకర్‌ది. ఆ విషయంలో నేను ఎప్పుడు అతన్ని అభిమానిస్తూనే ఉంటాను. ముఖం మీద మాట్లాడే స్వభావం ఉన్నవారిని ఎవరూ ఇష్టపడరు.. కానీ ఒక కామెంటేటర్‌గా అతను అందర్నీ అన్ని  వేళలా సంతృప్తి పరచలేడు. అతను చేసే జాబ్‌లో అది కుదరకపోవచ్చు. 

సంజయ్‌ ఎవరికీ వ్యతిరేకం కాదు. సంజయ్‌ను కామెంటేటర్‌గా తీసినందుకు నేను ఎవర్నీ నిందించడం లేదు. కేవలం నేను బీసీసీఐకి రిక్వెస్ట్‌ మాత్రమే చేస్తున్నా. మంజ్రేకర్‌ను తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోండి. ఒకసారి బీసీసీఐ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా.. మొత్తం కామెంటరీ ప్యానల్‌లో ఉన్న అందరి ఇన్‌పుట్స్‌ తెప్పించుకోండి. 

అదే సమయంలో కోచ్‌లుగా చేసిన వారు మాట్లాడిన సందర్భాలను కూడా ఒకసారి పరిశీలించండి. ఒక బ్యాట్స్‌మన్‌ చెత్త షాట్‌ ఆడినప్పుడు కచ్చితత్వంతో మాట్లాడిన వారిని చాలామంది ప్రజలు అభిమానిస్తారు కదా.. అటువంటప్పుడు సంజయ్‌ చేసిన దాంట్లో తప్పేముంది’ అని చంద్రకాంత్‌ పండిట్‌ ప్రశ్నించాడు. 

ఇంగ్లండులో వన్డే ప్రపంచ కప్ సందర్భంగా 2019లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి చేసిన మొరటు వ్యాఖ్యకుగాను బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. అలాగే తోటి వ్యాఖ్యాత అయిన హర్షా భోగ్లేపై కూడా నేరుగా విమర్శలు చేయడం, టీమిండియా కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ వంటి వారిపై కూడా దూకుడుగా విమర్శలు చేయడం బీసీసీఐకి ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో గత నెలలో సంజయ్ మంజ్రేకర్‌ను తన కామెంటేటర్ల ప్యానల్ జాబితానుంచి బీసీసీఐ తొలగించింది.

 

క్రికెటర్ షమీని టెన్షన్ పెడుతున్న భార్య ..బోల్డ్ పిక్‌తో రచ్చరచ్చ

క్రికెటర్ షమీని టెన్షన్ పెడుతున్న భార్య ..బోల్డ్ పిక్‌తో రచ్చరచ్చ

   2 hours ago


కోహ్లీ అంటే చాలా గౌరవం.. కానీ భయపడను.. పాక్‌ యువపేసర్‌ షా

కోహ్లీ అంటే చాలా గౌరవం.. కానీ భయపడను.. పాక్‌ యువపేసర్‌ షా

   03-06-2020


జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం

జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం

   02-06-2020


‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

   31-05-2020


స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

   31-05-2020


అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

   30-05-2020


ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

   29-05-2020


ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

   28-05-2020


క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

   27-05-2020


 క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

   27-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle